Showing posts with label ప్రశ్న. Show all posts
Showing posts with label ప్రశ్న. Show all posts

Friday, December 26, 2014

నన్ను ఈటీవీ (ETV) నుంచి తొలగించిన చానెల్ పెద్దలకో ప్రశ్న

"నన్ను ఈటీవీ (ETV) నుంచి తొలగించిన చానెల్ పెద్దలకో ప్రశ్న"


నా భర్త తెలంగాణవాదమే నన్ను తొలగించడానికి అసలు కారణమని చెప్పడానికి మీకు ఎందుకు ధైర్యం చాలడం లేదు? ఏవొ సొల్లు కారణాలు (అబధ్ధాలు) చూపించి నన్ను షూటింగులకు రావొద్దని చెప్పాల్సిన స్థాయికి ఎందుకు దిగజారారు?
గత 14 ఏళ్లుగా (నవంబర్ 2000) ఫ్రీలాన్స్ యాంకరింగ్ చేస్తున్నాను. ఇతర చానెల్స్ లో ఎన్ని ప్రొగ్రాంలు చేసినా ఈటీవీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. ఇది నా మాతౄ సంస్థ అనే భ్రమలో ఉండిపొయాను. నెలకు 30 ఎపిసొడ్ల నుంచి 15కి తగ్గించినప్పుడు, నా రెమ్యునరేషన్లో సగానికి సగం కోత పెట్టినప్పుడు, ఎందుకిలా చేసారు అని అడగడమే తప్ప, సంస్థ నుంచి వెళ్లిపోవాలని ఆలోచించలేదు. నేను చేస్తున్న "సఖి" లాంటి ప్రొగ్రాం తమ చానెల్లొ చేయాలని వేరే వాళ్లు అడిగితే, అది నైతికంగా కరెక్టు కాదని చెప్పి తిరస్కరించాను. బహుషా అదే నేను చేసిన పొరపాటు కావచ్చు. ఈటీవీ వదిలేసి వెళ్లి, యాంకరింగ్ టాలెంటు గతిలేక తిరిగి వచ్చిన వాళ్లను అందలం ఎక్కించినప్పుడే మీ ప్రాంతీయ దురభిమానం పసిగట్టాల్సింది. ఈ విషయం నా జీవిత భాగస్వామి నాకు చెప్పినా నేను నమ్మలేదు.

ఫ్రీలాన్స్ యాంకరింగ్ లో ఉన్నాసరే ఉద్యోగికంటే స్థిరంగా ఒక చోట నిలకడగా పని చేయాలని నమ్మాను. ఆ చేసేదేదో ఈటీవీలో కాకుండా ఇంకేదైనా చానెల్లొ చేయాలని నా భర్త చెప్తే తేలికగా తీసుకున్నాను. ఈటీవీలో ఏదొ ఒకరోజు నన్ను తెలంగాణ కోనం లొంచి చూస్తారని హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయాన చెప్పిందే నిజమైంది.