జూనియర్ అభిమానులను టార్చర్ పెడుతున్న బెల్లంకొండ !
జూనియర్
అభిమానులు భయపడినట్లే జరిగింది. ఈనెల 27న విడుదల అవుతుంది అని అనుకున్న
ఎన్టీఆర్ ‘రభస’ పాటల వేడుక ఆగష్టు 1కి వాయిదా పడినట్లుగా వార్తలు
వస్తున్నాయి. దీనికి కారణం 27 తారీఖున శిల్పకళా వేదిక ఖాళీ లేదు అని ఈ
సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ చెపుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్.
అయితే అసలు ఈ వాయిదాకి వేరొక కారణం ఉందని అంటున్నారు. ఈ వారం విడుదల
కాబోతున్న అల్లుడు శీను రిలీజ్
వ్యవహారాలలో బెల్లంకొండ బిజీగా ఉండటంతో ‘రభస’ ఆడియో వేడుకను ఆగష్టు 1కి మార్చారు అనే వార్తలు కూడ వినిపిస్తున్నాయి. అయితే ‘రభస’ రిలీజ్ డేట్ ఆగష్టు 14కు కేవలం రెండు వారాలు ముందు ‘రభస’ పాటలు జనం మధ్యకి వస్తే ఆ పాటలు ఈ అతి తక్కువ సమయంలో జనం మధ్యకు వేల్లలేకపోతే జూనియర్ రభస సినిమా విజయ అవకాశాల పై తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయని జూనియర్ అభిమానుల భయం అని టాక్. ఇప్పటికే జూనియర్ పుట్టిన రోజుకు విడుదల అయిన ‘రభస’ ఫస్ట్ లుక్ టీజర్ జూనియర్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచని నేపధ్యంలో ‘రభస’ పాటల విడుదల వాయిదా పర్వం యంగ్ టైగర్ అభిమానులను తీవ్ర కలవర పాటుకు గురి చేస్తోంది అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.
No comments:
Post a Comment