“గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్
వెంకటేష్, పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రధారులుగా
తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం “గోపాలా గోపాలా”. ఈ చిత్రంలో పవన్
కళ్యాణ్ కృష్ణుడిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. హిందీలో బ్లాక్ బస్టర్
హిట్ అయిన “ఓహ్ మై గాడ్” చిత్రానికిది రీమేక్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో
పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యాడని సమాచారం.
హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ఈ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్
పోషిస్తున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన కళ్యాణ్ ఈ తెలుగు రీమేక్
లో 25 నిమిషాలు కనిపిస్తాడని తెలుస్తోంది.ఈ విషయం స్వయంగా ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ కుమార్ మీడియాకి తెలిపాడు. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ రోల్ ఓన్లీ 25 మినిట్స్వెంకటేష్ మధ్యనున్న సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పుకొచ్చాడు కిశోర్ కుమార్.
అలాగే, విక్టరీ వెంకటేష్ పవన్ తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నానని, అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తాను కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వివరించాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురాబోతోందని టాలీవుడ్ కథనం.
No comments:
Post a Comment