సూర్యకి చుక్కలు చూపించిన సమంత
కోలీవుడ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత. సమంత
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేయటమే కాకుండా టాప్ హీరోలతో యాక్టింగ్
చేస్తూ తోటి హీరోయిన్స్ కి పెద్ద పోటీని ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా
హీరో సూర్యకి సమంత చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన టాక్స్ కోలీవుడ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహాటంగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత కోలీవుడ్
లో నటిస్తున్న మూవీలలో ఒకటి అంజాన్. అంజాన్ మూవీలో హీరో సూర్య సరసన సమంత
నటిస్తుంది.
ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ జులై 22న
జరిగింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కి తను రాలేనని సమంత గత పది రోజుల క్రితమే చెప్పుకొచ్చింది. అంజాన్ చిత్ర యూనిట్ మాత్రం కచ్ఛితంగా రావాల్సిందేనని చెప్పారట. కోలీవుడ్ లో మూవీ ప్రమోషన్స్ కి సహకరించకపోతే ఆర్టిస్ట్ లపై తీవ్ర నిర్ణయాలను కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటుంది. ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకున్న సమంత, ఆడియో ఫంక్షన్ రోజు ఎవో కారణాలు చూపెడుతూ ఫంక్షన్ కి డుమ్మా కొట్టింది. అయిత తను చెబతున్న కారణాలు మాత్రం చిన్నవేం కాదు. ‘’గతంలో ఎన్నడూ లేనంతగా తనకు మంగళవారం సినిమా కష్టాలు ఎదురయ్యాయని’’ సమంత ట్విటర్ లో చెప్పుకొచ్చింది. ఫుడ్ పాయిజన్ కావడంతో తాను స్వల్ప అనారోగ్యానికి గురయ్యాను. అంతేకాకుండా ట్రాన్సిట్ లో తన బ్యాగ్ ను పొగొట్టుకున్నాను అని ట్విటర్ లో వెల్లడించింది. అనారోగ్యం, ఫ్లయిట్ ఆలస్యం కావడంతో తాను అంజాన్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమంత తెలిపింది. సమంత ఆడియో ఫంక్షన్ కి వస్తుంది అనే ఆశలో హీరో సూర్య సైతం ఉన్నాడు. తనకు జరిగిన విషయాన్ని అంజాన్ మూవీ నిర్మాతలు, అలాగే హీరోకి చెప్పకుండా, ట్విట్టర్ లోనే ముందు పెట్టిందట. వీరంతా ట్విట్టర్ లో సమంత ట్వీట్ చూసి షాక్ అయినట్టుగా కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment