Thursday, July 24, 2014

బిగ్‌బాస్‌ షోలో రాహుల్‌ ప్రత్యర్థి

బిగ్‌బాస్‌ షోలో రాహుల్‌ ప్రత్యర్థి



kumarఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ గాంధీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తరపున కుమార్‌ విశ్వాస్‌ పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈయన తనదైన స్టైల్‌లో ప్రసంగాలు చేస్తూ, అమేథిలో మక్కాం వేసి మరీ ప్రచారం చేశాడు. ఈయన ప్రచారానికి భారీగా స్పందన వచ్చింది. దాంతో కాంగ్రెస్‌ వాదుల్లో రాహుల్‌ గాంధీ ఓడిపోతాడేమో అనే భయం కూడా పట్టుకుంది. ఈయన ప్రచారం చేసిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. దాంతో ఈయనకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది. అయితే ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయంపాలయ్యాడు. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయాడు.
ప్రొఫెసర్‌ అయిన కుమార్‌ విశ్వాస్‌ మళ్లీ తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. అయితే ఎన్నికల సమయంలో ఈయనకు వచ్చిన క్రేజ్‌తో ఈయన్ను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాల్సిందిగా ఆ కార్యక్రమ  బిగ్‌బాస్‌ షోలో కుమార్‌ విశ్వాస్‌ పాల్గొననున్నాడునిర్వాహకులు కోరుతున్నారు. అందుకోసం నిర్వాహకులు ఈయనకు ఏకంగా అయిదు కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ప్రారంభంకాబోతున్న బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌లో కుమార్‌ విశ్వాస్‌ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదరణతో బిగ్‌బాస్‌ షో సక్సెస్‌ అవ్వడం ఖాయంమని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment