ఈ కారు లవర్ కానుకా?
తమిళసినిమా: నటి అంజలి ఇటీవల సంచలనాలకు కేంద్రబిందువుగా
మారారు. పినతల్లితో మనస్పర్థలు, దర్శకుడు కలైంజయంతో వివాదం వెరసి అంజలి
వార్తల్లో వ్యక్తిని చేశాయి. పినతల్లితో గొడవపడి హైదరాబాదుకు మకాం మార్చిన ఈ
బ్యూటీ అక్కడ ఒక సినీ ప్రముఖుని చెప్పుచేతుల్లో ఉన్నట్లు ఆయన ఆమెకు
రక్షణగా నిలిచినట్టు ప్రచారం జరిగింది. ఆ తరువాత అంజలికి ఆ వ్యక్తి మధ్య
పరిచయం ప్రేమగా మారినట్లు పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే పెళ్లి విషయాన్ని అంజలి ఖండించారు. అయితే ప్రేమ మాత్రం రహస్యంగా
కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చాలా గ్యాప్ తరువాత అంజలి కోలీవుడ్‌లో రీ ఎంట్రీ అయ్యారు. జయం రవి సరసన
నటిస్తున్న చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. అసలు విషయం ఏమిటంటే
అంజలి ఇప్పుడు బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నారు. ఈ కారును ఆమె ప్రియుడు
బహుమతిగా ఇచ్చినట్లు సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంజలి చాలా
కాలంగా వాడుతున్న పాత కారును విక్రయించి ఇప్పుడు లవర్ కానుకగా ఇచ్చిన
బీఎండబ్ల్యూ కారులో షికార్లు చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ
పుకార్లపై అంజలి ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment