మీనా అ”దృశ్యం”
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “దృశ్యం” సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రీమేకయ్యి సంచలన విజయాలు సాధించింది. ఈ మూవీ తాజాగా తమిళ్ లో కూడా రీమేక్ కాబోతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో కమల్ కు జోడిగా మీనా నటిస్తుందంటూ కొన్నివార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం తమిళ “దృశ్యం”లో అతిలోకసుందరి శ్రీ దేవిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. “ఇంగ్లీష్ వింగ్లిష్” సినిమాతో ఇండస్ట్రీలోకమల్ కి జోడిగా శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీ దేవి తిరిగి చాలా కాలం తరువాత ఈ సినిమాతో మళ్ళీ కోలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతోందన్న వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
కమల్ హాసన్, శ్రీ దేవి కాంబినేషన్ లో “వసంత కోకిల” “గురు” “ఎర్ర గులాబీలు” వంటి హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మళ్ళీ ఈ సినిమాతోనే దాదాపు 32 సంవత్సరాల తరువాత కమల్, శ్రీ దేవి కాంబినేషన్ రాబోతుందని కోలీవుడ్ కథనం. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే.
No comments:
Post a Comment