Thursday, July 24, 2014

రంభపై కేసు



Rambha kandireega.com
ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కథానాయికగా నటించి ప్రేక్షకుల్లో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న రంభ నిజజీవితంలో విలన్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
వివరాలలోకి వెళ్తే, రంభ, ఆమె కుటుంబ సభ్యులుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రంభ సోదరుడి భార్య అయిన పల్లవి వీరిపై అదనపు కట్నం వేధింపుల ఆరోపణతో కేసు పెట్టింది.
అందిన సమాచారం ప్రకారం, 1999లో రంభ సోదరుడు శ్రీనివాస్ రావుతో పల్లవికీ వివాహమైంది. శ్రీనివాస్ రావుకు కట్నంగా నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. శ్రీనివాస్ రావు, పల్లవి దంపతులకు ఇద్దరు పిల్లలు. గత ఏడాదిగా పల్లవి భర్త శ్రీనివాస్ రావుతో పాటుపబ్లిసిటీ కోసమేనన్న రంభ సోదరుడు రంభ, వాళ్ళ తల్లిదండ్రులు పల్లవిని అదనపు కట్నం కోసం వేదించడం మొదలుపెట్టారు. వేదింపులు తట్టుకోలేక హైదరాబాద్ చేరుకొన్న పల్లవి వీరిపై కేసు నమోదు చేసింది. శ్రీనివాస్ రావు, రంభ, వీరి తల్లితండ్రులుపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కోర్ట్ ను ఆశ్రయించింది పల్లవి.
ఇదిలా ఉండగా, పబ్లిసిటీ కోసమే తన భార్య పల్లవి తమపై కేసు పెట్టిందని శ్రీనివాస్ రావు మీడియాకు చెప్పడం గమనార్హం.

No comments:

Post a Comment